“గుణ 369” విడుదల తేదీ ఫిక్సయ్యిందిగా…!

“గుణ 369” విడుదల తేదీ ఫిక్సయ్యిందిగా…!

Published on Jul 4, 2019 12:18 PM IST

హీరో కార్తికేయ మొదటి ప్రయత్నం “ప్రేమతో మీ కార్తీక్” చిత్రం అతనికి అంతగా గుర్తింపు తేకపోయినా ఆ తదుపరి చిత్రం “ఆర్ ఎక్స్ 100” మూవీ ఘనవిజయంతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడవ చిత్రంగా విడుదలైన “హిప్పీ” అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ట్రైలర్,టీజర్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసినా ఆ అంచనాలు అందుకోవడంలో సినిమా విఫలమైంది.

తాజాగా కార్తికేయ మరో మూవీని విడుదల చేయడానికి సిద్ధం చేశారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన “గుణ 369” మూవీని వచ్చేనెల 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ విడుదల చేయడం ద్వారా తెలియజేశారు. ఒకచేతిలో రక్తం మరకలతో వేటకొడవలి,మరో చేతిలో వేడివేడి టీ పట్టుకొని కూర్చొని ఉన్న కార్తికేయ ఫోజ్ చూస్తుంటే ఈ మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు కొదవలేదనిపిస్తుంది.

కార్తికేయ సరసన అనఘా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్ప్రింట్స్ ఫిలిమ్స్,జ్ఞాపికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తిరుమలరెడ్డి,అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు