సీక్రెట్ గా పాలిటిక్స్ చేస్తోన్న హీరో ?

Published on Feb 6, 2019 2:56 pm IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువ హీరోల్లో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటారు. పైగా సామాజిక అంశాల పై ఆయన ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే తాజా సమాచారం మనోజ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతునట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే మనోజ్ చాలా కాలంగా రాజకీయాల పై కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగానే కొన్ని రోజులు క్రితం ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కూడా కామెంట్స్ చేసారు. అలాగే కియా మోటార్స్’ను ఏపీకి తీసుకురావడం పై కూడా మనోజ్ హర్షం వ్యక్తం చేస్తూ ఆ మధ్య పోస్ట్ కూడా పెట్టారు. అయితే మనోజ్ గత కొంత కాలంగా తిరుపతిలోనే ఉంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళే ప్రయత్నంలోనే.. సీక్రెట్ గా ఓ నియోజిక వర్గం పై పట్టు సాధించే పనిలో ఉన్నారట.

వీటికి తోడూ వైసీపీ నుంచి మనోజ్ కి ఎమ్ ఎల్ ఏ టికెట్ ఆఫర్ కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో ఒకసారి మనోజ్ మార్చిలో మొదలవ్వబోయే చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకున్నాం అని ట్వీట్ చేసారు. ఈ మాటకి అర్ధాన్ని బట్టి మనోజ్ కొత్త చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ మార్చిలో స్టార్ట్ చేయనున్నారని అప్పుడు అనుకున్నారు.

కానీ ప్రస్తుతం మనోజ్ కదలికలను గమనిస్తే.. ఏపీలో జరగబోయ్యే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మనోజ్ అప్పుడు ఆ ట్వీట్ చేసినట్లు అర్ధమవుతుంది. మొత్తానికి ఈ హీరో రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :