అల్లరి నరేష్ “ఆ ఒక్కటీ అడక్కు” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి హీరో నాని!

అల్లరి నరేష్ “ఆ ఒక్కటీ అడక్కు” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి హీరో నాని!

Published on Apr 22, 2024 11:30 AM IST


టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఈ చిత్రం తో ఆడియెన్స్ ను మళ్ళీ తనదైన కామెడీ మార్క్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంను మే 3, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నేడు సాయంత్రం 4:05 గంటలకి AAA సినిమాస్, స్క్రీన్ 1, అమీర్ పేట్ లో స్టార్ట్ కానుంది. అయితే ఈ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు