తన క్లాసిక్ డైరెకర్ తో నాని ?

తన క్లాసిక్ డైరెకర్ తో నాని ?

Published on Mar 30, 2021 2:00 AM IST

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నేచురల్ స్టార్ నానితో ఇప్పటికే జెర్సీ అనే క్లాసిక్ మూవీ తీసాడు. అయితే మళ్ళీ నానితో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. పైగా ఈ సారి చేయబోయే సినిమా పాన్ ఇండియా మూవీ అట. నానికి కథ కూడా వినిపించాడని.. నాని కూడా కథ విని చాల బాగుందని, ఈ ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెడదామని చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

కాగా గౌతమ్ ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. అయితే హిందీలో ఈ రీమేక్ హిట్ అయితే, నానితో చేయబోయే సినిమాకి బాగా కలిసొస్తుందని గౌతమ్ భావిస్తున్నాడు. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు