హీరో నిఖిల్, ఆర్జీవీ ట్వీట్స్ వైరల్

హీరో నిఖిల్, ఆర్జీవీ ట్వీట్స్ వైరల్

Published on Dec 3, 2023 5:24 PM IST

తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్‌ నిలిచింది. దీంతో, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, హీరో నిఖిల్, రేవంత్ రెడ్డి, బీజేపీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో అఖండ విజయం సాధించిన రేవంత్ అన్నకు కంగ్రాట్స్. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో గెలుపొందిన బీజేపీకి అభినందనలు. ప్రజాస్వామ్యం బతికే ఉంది. జై హింద్’ అంటూ హీరో నిఖిల్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వరుస ట్వీట్లు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేస్తూ.. ‘మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో గెలుపొందింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌ లో పేర్కొన్నాడు. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌‌తో నేను’ అని ఓ ఫొటోను కూడా వర్మ షేర్ చేయడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు