కొత్త కంటెంట్ తో నిఖిల్ ?

Published on Mar 8, 2021 12:35 pm IST

యంగ్ హీరో ‘నిఖిల్’కి ఈ మధ్య భారీ సక్సెస్ వచ్చి చాల కాలం అయిపోయింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ కొట్టలేక సతమతమవుతున్నాడు. అయితే, నిఖిల్ తాజాగా ఓ కొత్త సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రైటర్ కోన వెంకట్ రాసిన ఈ కథ మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఫన్నీ ‘వే’లో ప్రస్తావించబోతున్నారని.. ఇదొక మెడికల్ థ్రిల్లర్ అని సమాచారం. మొదట ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్ళిందట.

అయితే ప్రసుతం సాయి తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాలుగు సినిమాలు చేతిలో ఉండటంతోనే తేజ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అందుకే ఈ సినిమా నిఖిల్ దగ్గరకు వచ్చిందట. ఇక ఈ సినిమాని సమ్మర్ తర్వాత నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ కి హిట్ వస్తోందా ? మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లో కథ అంటే.. కాస్త కొత్త కంటెంట్ ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :