నిఖిల్ క్రేజీ సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

Published on Mar 4, 2020 12:35 pm IST

నిఖిల్ ‘అర్జున్ సురవరం’ మంచి టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకువెళ్తున్నాడు. అయితే నిఖిల్ తన కెరీర్ లో మరో క్రేజ్ సినిమాతో కూడా రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది. రేపు ఉదయం 9 గంటలకు ముహూర్తం మరియు టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

కాగా సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More