‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన హీరో నితిన్

Nithiin Launches Its Life Bro First Look

హీరో నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. కేఎం (కృష్ణమోహన్), పూజా సుందర్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కృష్ణ మోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక వైవిధ్యమైన ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు సోమశేఖర్ రెడ్డి తెలిపారు. హృదయానికి హత్తుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ భావోద్వేగ ప్రేమకథ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ఇ.రాజయ్య కథ, స్క్రీన్‌ప్లే అందించగా, సాహిత్య సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇందులో రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవి ప్రసాద్, కిరీటి, త్రిశూల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య డీఓపీగా, సత్య గిద్దుటూరి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version