స్టార్ హీరోకి కరోనా టెస్ట్..రిజల్ట్?

Published on Jun 3, 2020 10:43 pm IST


మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్ట్ లో ఆయనకు నెగెటివ్ అని వచ్చింది. దీనితో సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఆ రిజల్ట్ అభిమానులతో పంచుకున్నారు. విదేశాల నుండి వచ్చిన ఆయన కరోనా లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

ఆడుజీవితం అనే ఓ చిత్ర షూటింగ్ కోసం జోర్డాన్ దేశం వెళ్లిన చిత్ర బృందం అక్కడ ఇరుక్కు పోయారు. వీరు షూటింగ్ కొరకు అక్కడకు వెళ్లిన కొద్దిరోజులలో వరల్డ్ వైడ్ గా లాక్ డౌన్ ఏర్పడింది. దీనితో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేయడం జరిగింది. దీనితో నెలరోజులకు పైగా ఆ దేశంలో కనీస వసతులు, ఆహారం లేక పృథ్వి రాజ్ మరియు చిత్ర బృందం ఇబ్బంది పడ్డారు. చివరకు ప్రభుత్వ చొరవతో ఓ ప్రైవేట్ ఫ్లైట్ ద్వారా వీరు కేరళ చేరుకున్నారు.

సంబంధిత సమాచారం :

More