ప్రత్యేక సెట్ లో సీనియర్ హీరో షూటింగ్ !

ప్రత్యేక సెట్ లో సీనియర్ హీరో షూటింగ్ !

Published on Nov 15, 2018 4:29 PM IST

సీనియర్ హీరో డా రాజ‌శేఖ‌ర్, యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజ‌శేఖ‌ర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ చిత్రంలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కోసం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రస్తుతం చిత్రబృందం శరవేగంగా షూటింగ్ జరుపుతుంది. పైగా ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా నటిస్తున్నారని..ముఖ్యంగా రాజ‌శేఖ‌ర్ రిస్క్ చేసి మరి.. ఫైట్స్, జంప్స్ వంటి రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి రాజ‌శేఖ‌ర్ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు