మహేష్ దర్శకుడి పార్టీలో ఇస్మార్ట్ హీరో ..!

మహేష్ దర్శకుడి పార్టీలో ఇస్మార్ట్ హీరో ..!

Published on Nov 25, 2019 4:46 PM IST

anil

గత రాత్రి దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ లోని కొందరు సన్నిహితులకు మరియు సరిలేరు నీకెవ్వరు మూవీ నటులకు పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ తుది దశకు చేరడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. ఈ పార్టీలో హీరో రామ్, సరిలేరు నీకెవ్వరు హీరోయిన్ రష్మిక మందాన, యాంకర్ అనసూయ లతో పాటు, కమెడియన్ శ్రీనివాస రెడ్డి, దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్ పాల్గొన్నారు.

ఐతే హీరో రామ్ ఈ పార్టీకి హాజరుకావడం విశేషత సంతరించుకుంది. అనిల్ రావిపూడి విందులో రామ్ కనిపించడంతో భవిష్యత్తులో వీరిద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఇక రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీలో నటిస్తుండగా ఇది ఓ తమిళ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండడం విశేషం. ఇక ఈఏడాది హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు