ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ ?

ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ ?

Published on Mar 28, 2021 10:19 PM IST

NTR

ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా రేంజ్ లో మూవీని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మరో పాన్ ఇండియా స్టార్ నే తీసుకోవాలని త్రివిక్రమ్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఈ సినిమాలో నటించే విలన్ గురించి ఒక ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమలో విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నిజంగానే నటిస్తున్నాడా లేడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు