మెగాస్టార్ ‘విశ్వంభర’లో తమిళ హీరో ?

మెగాస్టార్ ‘విశ్వంభర’లో తమిళ హీరో ?

Published on Jan 30, 2024 8:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో మరో యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో శింబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా హీరో శింబు పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ పాత్రను దర్శకుడు వశిష్ట చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

మొత్తానికి రోజురోజుకు విశ్వంభర పై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమాను అద్భుతంగా మలుస్తున్నారట. ఈ క్రమంలోనే ఆ మధ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు