హీరో శ్రీకాంత్‌ ఇంట విషాదం

హీరో శ్రీకాంత్‌ ఇంట విషాదం

Published on Feb 17, 2020 9:21 AM IST

srikanth

హీరో శ్రీకాంత్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 70ఏళ్ళు అని తెలుస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

నేటి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీలక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు