షూటింగ్ మొదలుపెట్టిన కామెడీ సినిమా !

షూటింగ్ మొదలుపెట్టిన కామెడీ సినిమా !

Published on Feb 7, 2019 3:57 PM IST


యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కర్నూలులో ఈ రోజు నుంచి మొదలు అయింది. ఈ సినిమాలో సందీప్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే సందీప్ కిషన్ మొత్తానికి మళ్లీ కామెడీనే నమ్ముకుంటున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి మంచి ఎంటర్ టైనర్ తో హిట్ అందుకున్న సందీప్కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయి కామెడీ సినిమాను చెయ్యలేదు.

అందుకే ఈ సారి ఎలాగైనా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కామెడీ సినిమాని ప్లాన్ చేశారట. పైగా ఈ సినిమా టైటిలే ఫన్నీగా ఉండటంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు