ఇంటర్వ్యూ : హీరో సూర్య – ‘ఎన్.జి.కె’ పొలిటికల్ థ్రిల్లర్ !

Published on May 28, 2019 7:12 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఎన్.జి.కె’ సినిమా మే 31వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా ‘ఎన్.జి.కె’ గురించి చెప్పండి ?

‘ఎన్.జి.కె’ ఒక పొలిటికల్ థ్రిల్లర్. ‘ఎన్.జి.కె’కి ఫుల్ మీనింగ్ నందగోపాల్ కృష్ణ. నందగోపాల్ కృష్ణ అనే సామాన్య వ్యక్తి సిస్టమ్‌ లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి పొలిటికల్‌ సిస్టమ్‌ మీద ఎలాంటి పోరాటం చేసాడు అనేది మెయిన్‌ పాయింట్‌. అయితే నందగోపాల్ కృష్ణ రాజకీయాల్లోకి వచ్చాక ఏమి చేసాడనే పార్ట్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది. ప్రధానంగా సినిమాలో రాజకీయాలకు సంబంధించి చాలా బలమైన పాయింట్ ని చెబుతున్నాం. అలాగే ‘ఎన్‌.జి.కె’ టెక్నికల్‌ గా హై క్వాలిటీలో ఉంటుంది.

 

సెల్వరాఘవన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

సెల్వరాఘవన్ తో పని చేయడం చాలా హ్యాపీ అండి. తను గొప్ప ఫ్యాషన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం అతను సుమారు మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రతి సీన్ లో.. ప్రతి క్యారెక్టర్ లో తన పని మనల్ని ఆకట్టుకుంటుంది. నిజంగా సెల్వరాఘవన్ లాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. తనకి సినిమాకి సంబధించి ప్రతి అంశం పై ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటుంది.

 

సెల్వరాఘవన్ సినిమాల్లో పాత్రలకు బలమైన సంఘర్షణ ఉంటుంది. ‘ఎన్.జి.కె’ కూడా అలాగే ఉండబోతుందా?

ఖచ్చితంగా ఉంటుంది. నందగోపాల్ కృష్ణ అనే వ్యక్తిలో సామాన్య వ్యక్తి కనిపిస్తాడు. సొసైటీలో ముఖ్యంగా పాలిటిక్స్ కారణంగా ఒక మాములు వ్యక్తి ఎలా సఫర్ అవుతున్నాడు. దాని వల్ల సమాజం ఎలాంటి స్థితిలోకి వెళ్తుంది. అయితే ఈ సందర్భంలో నందగోపాల్ కృష్ణ అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఏ ఉద్దేశ్యంతో వెళ్ళాడు. ఆ తరువాత అతను చేసిన పనులు ఏంటి.. ఇవ్వన్నీ బలమైన సంఘర్షణతో కూడుకున్నవే.

 

ఈ సినిమాలో మీ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి గురించి చెప్పండి?

వాళ్ళ ఇద్దరి క్యారెక్టర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. రకుల్ ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ ట్రై చేసింది. చాలా ధైర్యం గల అమ్మాయిగా తను కనిపిస్తోంది. సినిమా చూశాక తన పాత్ర కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. సాయి పల్లవి గురించి చెప్పేది ఏముంది.. తాను ఎప్పుడూ అద్భుతంగానే చేస్తోంది.

 

ఇది పక్కా పొలిటికల్‌ డ్రామా కదా. మరి తమిళ్‌ లో ఈ సినిమాకి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ వచ్చింది ?

పొలిటికల్‌ డ్రామా అయినా కూడా, సినిమాలో మిగిలిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. మెయిన్ గా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ స్ చాలా బాగుంటాయి. అలాగే ఎమోషన్, సాంగ్స్, హ్యూమర్ ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ సినిమాని మలిచారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
 

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి కె.కె.రాధామోహన్‌ గారినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ?

మేం (నవ్వుతూ) సెలెక్ట్ చేసుకోలేదండి. ఆయనే మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా పై ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఈ సినిమాని తీసుకునే ముందు ఆయన అసలు సినిమాని చూడలేదు. ఇక సినిమాని ఆయన చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలల్లో సినిమా ఇంత పెద్ద ఎత్తున విడుదల కాబోతుందంటే దానికి ఆయనే కారణం.

 

మీరు ‘యాత్ర 2’లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ?

ఆ వార్త నేను కూడా విన్నాను. జగన్ గారితో నాకు చాలా సంవత్సరాల నుండి మంచి అనుబంధం ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన సాధించిన విజయం ఎంతో అద్భుతమైనది. ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. ఇక ‘యాత్ర 2’ గురించి అయితే ఇంతవరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ స్క్రిప్ట్ ఆకట్టుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా చేస్తాను.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

దర్శకుడు శివతో ఓ సినిమా ఉంటుంది. త్వరలోనే షూట్ కి వెళ్ళబోతున్నాం. అలాగే మరో రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More