కేరింత ఆడిషన్ కి వెళ్తే నన్ను రిజెక్ట్ చేశారు – విజయ్ దేవరకొండ

కేరింత ఆడిషన్ కి వెళ్తే నన్ను రిజెక్ట్ చేశారు – విజయ్ దేవరకొండ

Published on Apr 1, 2024 8:32 PM IST

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ స్టార్ (Family star) మూవీ ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) హీరోగా నటించిన ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం కి పరశురామ్ దర్శకత్వం వహించగా, గోపీ సుందర్ సంగీతం అందించారు.

ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నేడు జరిగిన ప్రెస్ మీట్ లో హీరో విజయ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేరింత ఆడిషన్ కి వెళ్తే తనను రిజెక్ట్ చేశారు అని, అప్పుడే వీళ్ళందరికీ నేనంటే ఏంటో చూపిస్తా అని అనుకున్నా అన్నట్లు తెలిపారు. ఫైనల్ గా ఇప్పుడు అదే బ్యానర్ లో ఏప్రిల్ 5 కి సినిమా వస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు