ప్యూర్ లవ్ స్టోరీలో విజయ్ దేవరకొండ?

Published on Sep 11, 2019 11:12 pm IST

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. పూరి – విజయ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్రేమ కోసం ఓ యువకుడు ఏం చేసాడనేదే సినిమా పాయింట్ అట. ఇక ఈ సినిమా టైటిల్ ‘ఫైటర్’ అని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమా తన శైలి జోనర్ లోనే తెరకెక్కనుంది.. అయితే సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More