ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్2 మధ్య వార్ అంటే.. యష్ సమాధానం అదే.

Published on Mar 7, 2020 10:44 am IST

సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. అందులో ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కాగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ తో చేస్తున్న కెజిఎఫ్ 2 మరొకటి. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది 8న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక స్పష్టమైన తేదీ ప్రకటించకున్నప్పటికీ వేసవి చివర్లో కెజిఎఫ్ 2 విడుదలయ్యే అవకాశం కలదు.

ఐతే కెజిఎఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపై కెజిఎఫ్ హీరో యష్ స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ మరియు కెజిఎఫ్2 మధ్య క్లాష్ అనేది జరగని పని అన్నారు. ఇక ఈ రెండు చిత్రాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనిల్ తడానీ , కాబట్టి రెండు ఒకే సమయంలో విడుదల అవడం జరగదు అన్నారు.

సంబంధిత సమాచారం :

More