ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ పిర్యాదు.

Published on Jun 3, 2020 11:41 am IST

హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులపై సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు. విషయంలోకి వెళితే…మీరా చోప్రా ట్విటర్‌లో అభిమానులతో చాట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో ఓ నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?… అని అడుగగా. ‘నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు’ అని మీరా సమాధానమిచ్చింది. మీరా ఇచ్చిన సమాధానంతో అసహనానికి గురైన కొందరు నెటిజన్లు ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తూ ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు.

వారి ట్వీట్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి ఆధారాలు ఆమె ప్రొడ్యూస్ చేశారు. అలాగే సదరు అభిమానుల ట్విట్టర్ అకౌంట్స్ డిలీట్ చేయాలని మీరా చోప్రా ట్విట్టర్ ప్రతినిధులకు రిపోర్ట్ చేశారు. కాగా మీరా చోప్రా తెలుగులో పవన్ సరసన బంగారం మూవీలో నటించిది. ఆలాగే వాన, మారో వంటి సినిమాలలో ఆమె నటించారు.

సంబంధిత సమాచారం :

More