వాళ్లపై రష్మిక సెటైర్ వేసింది!

rashmika 4
అనతి కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందాన. టాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రాలలో ఒకటి రెండు మినహా ఇస్తే మొత్తం హిట్ అని చెప్పాలి. లక్కీ లేడీగా ముద్ర వేసుకున్న రష్మిక భారీ ఆఫర్స్ దక్కించుకోవడంతో పాటు వరుస విజయాలు అందుకుంటుంది. గత ఏడాది రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇక అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుండగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . అలాగే తాజాగా రష్మికకు ఓ డైరెక్ట్ హిందీ చిత్రంలో అవకాశం దక్కింది. దీనితో రష్మిక రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందంటూ కథనాలు రావడం జరిగింది.

రష్మిక బాలీవుడ్ భామల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వరుస కథనాలు రాగా… రష్మిక మందాన స్పందించారు. సదరు కథనాలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు రష్మిక. నిజంగా వారు రాస్తున్నట్లు నాకు కోట్ల పారితోషికం అందితే బాగుండు, నా కల కూడా నెరవేరుతుందని రష్మిక, నిరాధార కథనాలు రాసిన వారిపై సెటైర్ వేశారు.

Exit mobile version