బన్నీ మూవీలో టబు లుక్ అదిరిందిగా

బన్నీ మూవీలో టబు లుక్ అదిరిందిగా

Published on Jul 24, 2019 9:25 AM IST

అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్,హారిక మరియు హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

ఐతే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె తాజాగా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఆమె షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా గీతా ఆర్ట్స్ వారు షూటింగ్ సెట్స్ లోని ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. నిండైన చీరలో చేతిలో డైలాగ్ పేపర్లు పట్టుకొని శ్రద్దగా ప్రిపేర్ అవుతున్న టబు ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించారు. ఇప్పటికే ఈ చిత్రంలో నివేదా థామస్, సుశాంత్, నవదీప్ వంటి స్టార్స్ నటిస్తుండగా, టబు రాకతో ఈ మూవీకి ఇంకా క్రేజ్ వచ్చే చేరింది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు