టాలెంటెడ్ హీరోయిన్ కి లైంగిక వేధింపులు !

Published on May 26, 2020 1:00 am IST

సినీ పరిశ్రమల్లో ఆ మధ్య మొదలైన ‘మీటూ’ ఉద్యమం మొత్తానికి ఇప్పటికి కూడా ఎవరొక హీరోయిన్ కారణంగా కొనసాగుతూనే ఉంది. కాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే కొందరు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనలు వేధింపులను బాహాటంగానే చెప్పుకొచ్చారు. తాజాగా మాజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా నిజంగానే సినీ పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉందని నటీమణులను చాలా తక్కువగా చూస్తుంటారని కామెంట్స్ చేసింది.

ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు అవమానాలను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదు అని ఓ స్టార్ డైరెక్టర్ అన్నారు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు. అలా ఎన్నో వేధింపులను ఎదుర్కొని పైకి వచ్చానని ఐశ్వర్య రాజేష్ చెప్పింది.

సంబంధిత సమాచారం :

More