ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్ సోదరుడు..

ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్ సోదరుడు..

Published on Dec 11, 2014 9:21 PM IST

catherine-tresa
‘ఇద్దరమ్మాయిలతో’, ‘పైసా’, ‘ఎర్రబస్సు’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ కేథరిన్‌ త్రేసా. బుధవారం సాయంత్రం బెంగుళూరులో కేథరిన్‌ సోదరుడు క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఆర్ధిక సమస్యల కారణంగానే క్రిస్టోఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. బెంగుళూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో బికాం చదువుతున్న క్రిస్టోఫర్ కు, గత కొంత కాలంగా ఫ్యామిలీతో సత్సంబంధాలు లేవు. చదువు కొనసాగించడానికి కూడా డబ్బులు లేవు. కేథరిన్ మరియు కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అతనికి సహాయం చేయకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు తెలిపారు.

సోదరుడి అంత్యక్రియలకు హాజరుకావడానికి కేథరిన్ బెంగుళూరు ప్రయాణం అయ్యింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’తో పాటు మరో తమిళ సినిమాలో నటిస్తుంది.

తాజా వార్తలు