
అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా ఈ తరం యువ హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా నటించనున్న సినిమాకి వివి వినాయక్ డైరెక్టర్. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారికంగా లాంచ్ అయిన నాటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ పలువురు పేర్లు వినిపించాయి. కానీ తాజాగా అఖిల్ వాటికి తెరదించి, తన హీరోయిన్ ని పరిచయం చేసాడు.
నార్త్ ఇండియన్ భామ సయేశా సైగల్ అఖిల్ తో జోడీ కట్టనుంది. ‘నా మొదటి సినిమా హీరోయిన్ సయేశా సైగల్ ని మీకు పరిచయం చేస్తున్నాను. నాలాగే తనకి కూడా ఇదే మొదటి సినిమా. తను కూడా నాలాగే నర్వస్ గా ఫీలవుతోందని’ అఖిల్ ట్వీట్ చేసాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరబాద్ ఓల్డ్ సిటీలో మొదలు పెట్టి అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని షూట్ చెయ్యనున్నారు. ఆ తర్వాత ఓ లాంగ్ షెడ్యూల్ కోసం అమెరికా మరియు సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు.
అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు. నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

