సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న హీరోయిన్ !
Published on May 16, 2018 4:16 pm IST

తెలుగు లో తాము నటించే సినిమాల్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు పర బాషా కథానాయకలు. తెలుగు నేర్చుకోవడం కొంచెం కష్టమైనా ఏమాత్రం వెనుకడుగువేయకుండా తెలుగు లోనే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు.సీనియర్ హీరోయిన్ ‘సమంత’తో పాటు ‘కీర్తి సురేష్’ ఆలాగే తను తెలుగులో నటించిన మొదటి సినిమాలోనే తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అందిరిని ఆశర్యపరిచిన ‘సాయి పల్లవి’ వీళ్లంతా ఇప్పుడు ఈ బాటలోనే పయనిస్తున్నారు .

తాజాగా ఈ జాబితాలో మ‌రో హీరోయిన్ చేరింది.త‌నే ‘అతిథిరావు హైద‌రీ’ మ‌ణిర‌త్నం ‘చెలియ’తో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది హైద‌రీ. ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘స‌మ్మోహ‌నం’లో క‌థానాయిక‌గా నటిస్తుంది .ఈ పాత్ర కోసం స్వయంగా తనే డ‌బ్బింగ్ చెప్పుకుంది.ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది.ఇందులో హైద‌రీ అలాంటి పాత్రే లోనే నటిస్తుంది. ఈ సినిమా జూన్ 15న రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook