త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోతోంది. పిఎస్.వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్ ఈ సినిమా కోసం లొకేషన్ సెర్చ్ లో ఉన్నారు.
హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మించబోయే ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ మూవీ లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరుకు ఈ విసయంపై స్పష్టత లేదు.
