ఆ పాత్ర కోసం ఎదురుచూస్తున్నా – ప్రియమణి

Published on Jun 17, 2021 5:02 pm IST

సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ‘ఫ్యామిలీ మెన్’తో మళ్ళీ డిమాండ్ పెరిగింది. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందినా ప్రియమణికి గతంలో రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఆమె హీరోయిన్ గా ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ వస్తున్నాయి. కాగా ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్ రోల్ గురించి వివరించింది.

రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్రను చెయ్యాలని తానూ కొన్నేళ్ళుగా కలలు కంటున్నాను అని ప్రియమణి చెప్పుకొచ్చింది. అసలు తను నీలాంబరి లాంటి పాత్రలకు పర్ఫెక్ట్ అని, నా బాడీ లాంగ్వేజ్, నా డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు కరెక్ట్ గా సరిపోతుందని ప్రియమణి అభిప్రాయపడుతోంది. మరి అలాంటి పాత్ర ప్రియమణికి ఎప్పుడు వస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :