బాధలో కూడా నాగార్జునకు థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్ !

Published on Jul 6, 2018 4:15 pm IST

మాజీ హీరోయిన్ సోనాలి బెంద్రే తను కాన్సర్ బారిన పడిన విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెకు హై గ్రేడ్ కాన్సర్ అని తేలింది. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాన్సర్ తో పోరాడుతున్న ఆమె, తొందరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె రిప్లై ఇచ్చారు.

కాగా నాగ్, త్వరగా కోలుకోవాలని సోనాలి బెంద్రేకి ట్వీట్ చేస్తూ ‘క్యాన్సర్‌ ను పూర్తిగా జయించాలనుకునే నీ గొప్ప సంకల్పానికి గొప్ప బలం చేకూరి నువ్వు త్వరగా కోలుకోవాలి డియర్’ అని నాగార్జున ట్వీట్‌ పెట్టారు. దానికి ఆమె ‘నాగ్.. థ్యాంక్యూ’ అని రీట్వీట్‌ చేసింది.

సంబంధిత సమాచారం :