క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నవీనా బోలే కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, నవీనా బోలే ఏం మాట్లాడారు అంటే.. ఆమె మాటల్లోనే.. ‘2004-05 సమయంలో ఓ ప్రాజెక్ట్ మీటింగ్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ ను కలిశా. అక్కడికి వెళ్లాకే అతడు ఎలాంటివాడో తెలిసింది. బట్టలు విప్పి కూర్చోమన్నాడు. నేను షాక్ అయ్యాను’ అని నవీనా బోలే చెప్పుకొచ్చింది.
ఈ విషయం పై నవీనా బోలే ఇంకా మాట్లాడుతూ..’ఎందుకు దుస్తులు తీయాలి ? అని అడిగితే.. దుస్తులు లేకుండా నా బాడీ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో చూడాలన్నాడు. వెంటనే నా ఫ్రెండ్ వేచి చూస్తోందని చెప్పి బయటకు వచ్చేశా. ఆ తర్వాత ఆయన పలుసార్లు కాల్స్ చేసినా నేను స్పందించలేదు. ఇది అప్పట్లో నన్ను ఎంతో బాధించింది. మరో దర్శకుడు కూడా నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు’ అని నవీనా బోలే తెలిపింది. మొత్తానికి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ అంటూ నవీనా బోలే చెప్పింది.