ఆ హీరోయిన్లు ఇద్దరు అత్తాకోడళ్లు కాబోతున్నారు

ఆ హీరోయిన్లు ఇద్దరు అత్తాకోడళ్లు కాబోతున్నారు

Published on Jul 29, 2019 2:47 PM IST

తమిళ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న”పటాస్” మూవీ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో ధనుష్ క్లీన్ షేవ్, గాగుల్స్ పెట్టుకొని మాస్ లుక్ లో ఇరగదీశాడు. ఐతే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూవీలో ధనుష్ డబుల్ రోల్ చేస్తున్నారట.

తండ్రి కొడుకులుగా ధనుష్ కనిపించనున్న “పటాస్” చిత్రంలో తండ్రి పాత్రకు హీరోయిన్ గా స్నేహా నటిస్తుండగా, యంగ్ క్యారెక్టర్ పక్కన మెహ్రిన్ నటిస్తుందని సమాచారం. మెహ్రిన్ ఓ తమిళ చిత్రంలో నటిచనుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో “పటాస్” మూవీతో అది ధృవీకృతం అయ్యింది. ఐతే నటి స్నేహా, మెహ్రిన్ కలిసి మొదటిసారి నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు అత్తాకోడళ్ళుగా నటిస్తున్నారన్నమాట. ఇటీవలే తమన్నా చెల్లిగా “ఎఫ్2” చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెహ్రిన్, ఇప్పుడు స్నేహ కోడలిగా మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం వివేక్ మరియు మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు