వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుహాస్, ‘హే భగవాన్’ అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శివానీ నగరం హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాస్, వంశీ నందిపాటి వంటి సక్సెస్ఫుల్ ద్వయం సమర్పిస్తోంది. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, ఫిబ్రవరి 20న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో సుహాస్ మాట్లాడుతూ, “గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. నా కెరీర్లోనే బెస్ట్ ఫిలింగా నిలుస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. నిర్మాత నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారని వంశీ నందిపాటి ప్రశంసించారు. ఆద్యంతం నవ్వులు పూయించేలా సినిమా ఉంటుందని హీరోయిన్ శివానీ పేర్కొన్నారు. సీనియర్ నటుడు నరేష్, స్రవంతి చొక్కారపు, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
