డిసెంబర్ 12న వస్తున్న ‘హేజా’..!

డిసెంబర్ 12న వస్తున్న ‘హేజా’..!

Published on Dec 5, 2019 11:51 PM IST

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. వి.ఎన్.వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. ఈ సంధర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ – “హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్ జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో ఒక డెవిల్ కి, మ్యుజిషియన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ గా చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే ఒక బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మా ప్రొడ్యూసర్ వి ఎన్ వోలేటి గారి సపోర్ట్ వల్లనే ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది. లిజీ గోపాల్ హీరోయిన్ గా కన్నా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువ కష్టపడింది. తన క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. నా స్నేహితుడు నాని చమిడిశెట్టి ఈ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వంశీ కూడా మంచి సపోర్ట్ చేశారు. అలాగే నూతన్ నాయుడు, లక్ష్మణ్ మంచి క్యారెక్టర్స్ చేశారు” అన్నారు.

ఇంకా మాట్లాడుతూ…”ముమైత్ ఖాన్ ను డెవిల్ గా చూపించడం జరిగింది. ఆమె కూడా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేసింది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా బాగా సపోర్ట్ చేశారు. త‌నికెళ్ళభ‌రణి మొదటి నుండి నన్నుసపోర్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి చిరంజీవి గారు అనేక విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇచ్చే మెస్సేజ్ కి ఈక్వల్ గా ఉండే మెస్సేజ్ ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మా సినిమాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు” అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, హీరోయిన్ లీజి గోపాల్, నిర్మాతలు పాల్గొన్నారు. త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌న్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం, మున్నా కాశి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు