డిసెంబర్ లో ‘హేజా’తో బయపెడతారట…!

డిసెంబర్ లో ‘హేజా’తో బయపెడతారట…!

Published on Nov 9, 2019 12:09 PM IST

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్,బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు,లక్ష్మణ్, లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవ‌ల‌ విడుదలై మంచి రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది.

ఈ సందర్భంగా..దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ – “ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన నేను ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ‘హేజా’ .. ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ హైలెట్ గా నిలవనుంది. టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీమిక్సింగ్ తో రూపొందుతోంది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నాం” అన్నారు.

కో – ప్రొడ్యూసర్ వి.య‌న్ వోలెటి మాట్లాడుతూ…”ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు డిఫరెంట్ గా ఈ సినిమాను దర్శకుడు మున్నా కాశి తెరకెక్కిస్తున్నారు. ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. అలాగే టెక్నికల్ గా కూడా బాగా రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో నటి ముమైత్ ఖాన్ క్యారెక్టర్ గత చిత్రాలకు సంబంధం లేకుండా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది” అన్నారు.

సాంకేతిక నిపుణులు :
కథ, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం – మున్నా కాశి
ప్రొడ్యూసర్: – కెవిఎస్ఎన్ మూర్తి
స‌హ‌నిర్మాత:- వి.య‌న్ వోలెటి
బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు