‘హాయ్ నాన్న’ : 4 రోజుల నైజాం కలెక్షన్ డీటెయిల్స్

‘హాయ్ నాన్న’ : 4 రోజుల నైజాం కలెక్షన్ డీటెయిల్స్

Published on Dec 11, 2023 5:13 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శౌర్ యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ లవ్, యక్షన్, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఇతర పాత్రల్లో జయరాం, నాజర్, ప్రియదర్శి వంటి వారు నటించారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.

అటు యుఎస్ఏ లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా కలెక్షన్ ని రాబడుతోంది. ముఖ్యంగా నైజాం లో ఈ మూవీ నిన్నటి 4వ రోజున రూ. 1.90 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. ఇక మొత్తంగా నైజాంలో గడచిన 4 రోజుల్లో రూ. 7 కోట్ల షేర్ (జీఎస్టీ కలుపుకుని) ని ఈ మూవీ రాబట్టడం విశేషం. నేడు సోమవారం కూడా హాయ్ నాన్న చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ రాబడుతోందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి టోటల్ గా ఈ మూవీ ఎంత మేర కలెక్షన్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు