
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా విడుదలకి దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని ఆసక్తికర విషయాలు భయటపడుతున్నాయి. ఈ సినిమా ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణితల మధ్య జరిగే త్రికోణ ప్రేమకథా చిత్రం అని, అలాగే ఈ సినిమాలో హై డోస్ కామెడీ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ‘కందిరీగ’ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైరెక్టర్. శ్రీనివాస్ తన మొదటి సినిమాలో కూడా ఎక్కువగా కామెడీ పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అదేరీతిలో ‘రభస’లో కూడా హై డోస్ కామెడీ ఉండనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.

