సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లింగా’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యింది.
అదేమిటంటే ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా ఫాన్తం ఫ్లెక్స్ 4కె హై స్పీడ్ కెమెరా వాడి తీస్తున్న సినిమా కావడంతో అంతటా చర్చనీయాంశం అయ్యింది. ఫాస్ట్ ఫాస్ట్ గా సాగే స్టంట్ సీక్వెన్స్ లను, చేజింగ్ సీక్వెన్స్ లను షూట్ చేయడానికి ఈ కెమెరాని ఉపయోగిస్తారు. గతంలో కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమాకి స్టంట్ మాస్టర్ గా పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్టేక్ లింగా సినిమాకి యాక్షన్ సీక్వెన్ ను కంపోజ్ చేస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నారు.
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ చిత్ర టీం సాంగ్స్ షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్లనున్నారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


