నాని 27వ మూవీ డైరెక్టర్ ఎవరో..?

నాని 27వ మూవీ డైరెక్టర్ ఎవరో..?

Published on Feb 24, 2020 2:37 PM IST

నాని తన ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ సిద్ధం చేశారు. పుట్టినరోజు కానుకగా తన 27వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు. నిన్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనికి సంబంధించిన ప్రకటన చేయండం జరిగింది. నాని 27వ చిత్రానికి సంబంధించిన ఓ స్మాల్ కాన్సెప్ట్ వీడియో సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. వరుస సినిమాలు ప్రకటిస్తున్న నాని నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ఇక నాని హీరోగా తెరకెక్కిన వి మూవీ వచ్చే నెల 25న ఉగాది కానుకగా విడుదల కానుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే మరో చిత్రంలో నాని నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు