రవితేజ కెరీర్లో రికార్డ్ బిజినెస్ చేసిన ‘కిక్ 2’

kick
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో తను చేసిన సూపర్బ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్’. ఈ సినిమా తనకి ఎంత కిక్ ఇచ్చిందో ప్రేక్షకులకు కూడా అంతే కిక్ ఇచ్చింది. రవితేజ కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయిన ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘కిక్ 2’. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రవితేజ కెరీర్లో నెంబర్ వన్ రికార్డ్ ని సృష్టించింది. ట్రేడ్ సర్కిల్స్ నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా కిక్ 2 సినిమాకి దాదాపు 30 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇరు రాష్ట్రాల రైట్స్, ఇండియా వైజ్ రైట్స్ మరియు ఓవర్సీస్ రైట్స్ ఇలా అన్నీ కలుపుకొని సుమారు 28-30 కోట్ల వరకూ బిజినెస్ అయ్యిందని వారు తెలిపారు.

రవితేజ కెరీర్లో ఈ రేంజ్ బిజినెస్ అవ్వడం ఇదే మొదటిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కిక్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఆ సినిమాకి సీక్వెల్ ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అలాగే ఈ రేంజ్ లోనే టికెట్స్ కూడా అమ్ముడుపోతుండడం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. కిక్ సినిమాకి కొనసాగింపు అయిన ఇందులో కూడా బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version