బన్నీ సినిమాలో ఎమోషనే హైలెట్ !

Published on May 31, 2019 4:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమా జూన్ 4 సెకెండ్ షెడ్యూల్ కి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఇక సహజంగానే తన సినిమాల్లో ఎమోషన్ని కాస్త ఎక్కువుగానే ఉండేలా చూసుకుంటాడు త్రివిక్రమ్. అయితే ఈ సారి ఆ ఎమోషన్నే హైలెట్ చేస్తూ.. సిస్టర్ సెంటిమెంట్ కి సంబంధించి సీక్వెన్స్ రాసాడట.

సిస్టర్ సెంటిమెంట్ అంటే రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డెప్త్ డైలాగ్ లతో చెల్లి సెంటిమెంట్ ను పండించడం కాకుండా.. ఇన్సిడెంట్స్ రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా త్రివిక్రమ్ కథ రాశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.

అలాగే ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More