ఆర్.కె.ఫిల్మ్ ఫ్యాక్టరీస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నువ్వేనా అది నీవేనా’. వంశీకృష్ణ, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి టీ. హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా మంచి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ వేడుకలో సినిమా యూనిట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాకు శ్రీ వెంకట్ సంగీతాన్ని సమకూర్చగా ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రమేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా స్వీయ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు.
