‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో పాటకు మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు ‘మేము సైతం’ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత మెగాస్టార్ ముఖానికి మేకప్ వేసుకోలేదు. సుమారు ఏడేళ్ళ తర్వాత 150వ సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇటీవల స్లిమ్ గా, గ్లామరస్ గా తయ్యారయ్యారు. మళ్లీ మునుపటి మెగాస్టార్ మనకు కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ స్టేజి పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో వెంకి, రవితేజ చిరుని వేదికపైకి తీసుకొచ్చారు. వద్దు వద్దు అంటూనే శంకర్ దాదా స్టెప్పులు వేశారు.
ఏడేళ్ళ తర్వాత కూడా మెగాస్టార్ డాన్స్ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. అదే స్టైల్, అదే జోరు. మొత్తం ‘మేము సైతం’ కార్యక్రమానికి చిరు డాన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. చిరుతో పాటు వెంకి, శ్రీకాంత్, అల్లు అర్జున్, దేవి శ్రీ తదితరులు డాన్స్ చేయడం విశేషం. చిరు డాన్స్ చూసిన తర్వాత ప్రేక్షకులలో ఎప్పుడెప్పుడు 150వ సినిమా చూస్తామా..? అనే కోరిక పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం ఉండదు.


