మెంటల్ మదిలో సినిమాతో మంచి హిట్ సాధించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ మరోసారి శ్రీ విష్ణు తో సినిమా చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. తాజాగా శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ హీరో మరింత స్పీడ్ పెంచడం జరిగింది.
అసుర దర్శకుడు విజయ్ తో తిప్పరా మీసం సినిమాలో నటిస్తున్న శ్రీ విష్ణు త్వరలో వివేక్ ఆత్రేయ సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా లో మరో హీరో నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్. శ్రీ విష్ణు నటించిన వీరభోగ వసంతరాయలు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నారా రోహిత్, సుధీర్ బాబు ఈ సినిమాలో నటించారు.


