“హిట్2” ట్రైలర్ అనౌన్స్ మెంట్ కి టైమ్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ హిట్ 2. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిరినేని మరియు నాని లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం కు సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై చిత్ర యూనిట్ మరో అప్డేట్ ను ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ అనౌన్స్ మెంట్ కి టైమ్ ను ఫిక్స్ చేసింది. నేడు సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ రిలీజ్ పై ప్రకటన రానుంది. ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version