“RRR” పై ప్రముఖ హాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.!

“RRR” పై ప్రముఖ హాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.!

Published on May 24, 2024 8:04 AM IST


మన తెలుగు సినిమా సహా భారటీయ సినిమా ఎంతో గర్వించదగ్గ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR) కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఏ భారతీయ సినిమా అందుకోని విధంగా గ్లోబల్ గా సెన్సేషన్ ని సెట్ చేసింది.

అయితే ఈ సినిమాకి హాలీవుడ్ కి చెందిన ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు కురవగా ఇప్పుడు మరోసారి ఈ భారీ సినిమా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాపై హాలీవుడ్ లో బ్రాండ్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన “ఇంటర్ స్టెల్లార్” చిత్ర నటి అనే హతవే కామెంట్స్ చేసింది.

తనకి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా అందరిలానే ఎంతో నచ్చింది అని, అది అమేజింగ్ అలాగే ఆ సినిమాలో ఎవరితోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆమె తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు