అమ్మ బయోపిక్ కోసం హాలీవుడ్ మేకప్ మెన్ !

అమ్మ బయోపిక్ కోసం హాలీవుడ్ మేకప్ మెన్ !

Published on Jul 29, 2019 12:00 AM IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు వస్తున్నారట. హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చెయ్యనున్నారు.

ఇక ఈ బయోపిక్ త్వరలోనే షూట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు రూపొందుతుంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రను కంగనా రనౌత్ ఎలా మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు