స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జనవరి 12 వస్తోందా అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రియాక్ట్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మా సాంగ్ లో బన్నీ డాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని.. ముఖ్యంగా బన్నీ కొత్తరకం స్టెప్స్ ను ఈ సాంగ్ లో వేశారని.. ఓవరాల్ గా అన్ని సాంగ్స్ లో కల్లా ‘బుట్ట బొమ్మా’ సాంగ్ లో బన్నీ స్టైలిష్ డాన్స్ సూపర్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘బుట్ట బొమ్మా’ సాంగ్ ను అర్మాన్ మాలిక్ పాడగా, రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాని అందించారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


