టీజర్ టాక్ : ‘కిష్కింధపురి’తో భయపెడుతున్న బెల్లంకొండ హీరో

Untitled 37

టాలీవుడ్‌లో హార్రర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే జోనర్‌లో మరో చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేయగా పూర్తి హార్రర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఈ మూవీ రెడీ అయింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఓ పాడుబడ్డ రేడియో స్టేషన్‌లో చోటు చేసుకునే భయానక సంఘటనలు మనకు ఈ సినిమాలో చూపెట్టబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. సువర్ణమాయ రేడియో స్టేషన్‌లో ఉండే అతీత శక్తి ఏమిటనేది ఈ సినిమా కథలో మనకు చూపెట్టనున్నారు. ఇక ఇందులోని మిస్టరీ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండబోతుంది.

మొత్తానికి న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version