గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో ప్రమోషన్స్ తోనే మంచి హైప్ ని అందుకొని వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రం “ఈషా” కూడా ఒకటి. అదిత్ అరుణ్, హెబా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ ల కలయికలో దర్శకుడు శ్రీనివాస్ మన్నే తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో ఉన్న కొన్ని రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టేసింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ సినిమాకి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా కెఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాణం వహించారు. అలాగే వంశీ నందిపాటి, బన్నీ వాస్ ల సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
