ఓటిటిలో “మంజుమ్మల్ బాయ్స్” ఎంట్రీపై మరో అప్డేట్ ఇచ్చిన హాట్ స్టార్

ఓటిటిలో “మంజుమ్మల్ బాయ్స్” ఎంట్రీపై మరో అప్డేట్ ఇచ్చిన హాట్ స్టార్

Published on Apr 24, 2024 9:00 AM IST

టాలెంటెడ్ నటీనటులు సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితర నటులు ముఖ్య పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ సర్వైవల్ డ్రామా “మంజుమ్మల్ బాయ్స్”. మళయాళంలో ఇండస్ట్రీ హిట్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి హాట్ స్టార్ వారు రీసెంట్ గానే అతి త్వరలో అఫీషియల్ గా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇప్పుడు మరో అప్డేట్ ని వారు అందించారు. ఈ సినిమా ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా తెలిపారు. ఇక రిలీజ్ ఎప్పుడు అనేది తేదీ రివీల్ చేయడమే బాకీ ఉందని చెప్పాలి. మరి పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ చిత్రానికి సుసీన్ శ్యామ్ సంగీతం అందించగా తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగులో రిలీజ్ కి తీసుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు